![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -243 లో...... ఇషిక, వీరు కలిసి శకుంతల మనసులో అందరి పట్ల నెగెటివ్ క్రియేట్ చేస్తారు. అప్పుడే స్నేహ తన ఫ్రెండ్ బైక్ పై రావడం చూస్తారు. ఇప్పుడు ఎవరని అడిగితే ఫ్రెండ్ అంటుంది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ అంటుంది. తర్వాత లేచిపోతుందని వీరు అంటాడు. అలా జరగడానికి వీళ్లేదని శకుంతల అంటుంది. ఇదేంటి అత్తయ్య మీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయని ప్రమీల, కార్తీక్ కీ కేక్ తినిపించే వీడియో చూపిస్తుంది. అది చూసి శకుంతల షాక్ అవుతుంది. ఇప్పుడే వెళ్లి అందరి సంగతి చెప్తానని శకుంతల అంటుంటే.. అత్తయ్య మీరు చేసే పొరపాటు ఇదే.. ప్రమీలకి రుద్ర ఇచ్చిన స్వేచ్ఛని పోగొట్టాలని వీరు చెప్తాడు.
ఆ తర్వాత గంగ అలారం పెట్టుకొని నిద్రలేవదు. దాంతో రుద్ర వచ్చి నిద్రలేపి బాక్సింగ్ ప్రాక్టీస్ కి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఇంట్లో అందరు ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతారు. ప్రమీల పై నుండి తెల్లచీర కట్టుకొని వస్తుంటే అందరు షాక్ అవుతారు. ఏంటి ప్రమీల ఇలా వచ్చావని పెద్దసారు అడుగుతాడు. నేను చెప్తానని శకుంతల వస్తుంది. తను అలానే ఉండాలి కాబట్టి అలా ఉండమని చెప్పానని శకుంతల అనగానే తనకి ఎలా ఉంటుందో ఆలోచించావా అసలు అని శకుంతలపై పెద్దసారు కోప్పడతాడు. దాంతో ఫోన్ లో ప్రమీల, కార్తీక్ కి కేక్ తినిపిస్తున్న వీడియో చూపిస్తుంది. అది చూసి అందులో తప్పేముందని పెద్దసారు అంటాడు. మీరు ఇలా అంటారని తెలుసని శకుంతల అంటుంది. ప్రమీల ఇంట్లో ఉంటే ఈ శిక్ష వేసేది కాదు కదా అని వీరు అంటాడు. అంటే సూపర్ మార్కెట్ కి వద్దని అంటున్నారా అని పెద్దసారు అంటాడు. ఇలా కూడా సూపర్ మార్కెట్ కి వెళ్లొచ్చని శకుంతల అంటుంది. నేనే దగ్గర ఉండి తీసుకొని వెళ్లి తన బాధ్యతలు చెప్పి వస్తానని ప్రమీలని తీసుకొని శకుంతల వెళ్తుంది. ఆ తర్వాత ఆ విషయం గంగ, రుద్రకి చెప్పాలని ఇంట్లో వాళ్ళు ట్రై చేస్తారు. ఎవరు పెద్దమ్మ మైండ్ పొల్యూట్ చేస్తున్నారని సూర్య, వంశీ వాళ్ళు అంటారు. ఉంటారులే అని ఇషిక వంక చూస్తూ అంటాడు రంగా. అత్తయ్య ఒకరు చెప్తే వినే స్టేజ్ లో ఏం లేదని ఇషిక అంటుంది. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు అన్నావ్ కదా అకాడమికి వెళ్లి ఈ విషయం రుద్రకి చెప్పమని రంగాతో ఇందుమతి అంటుంది.
మరొకవైపు ప్రమీలని తీసుకొని శకుంతల సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. ప్రమీల అలా వెళ్లడంతో మక్కమ్ షాక్ అవుతాడు. మేడం మీరు ఇలా వచ్చారేంటని అడుగుతాడు. అలా రాకూడదా అని శకుంతల కోప్పడుతుంది. అంటే నా ఉద్దేశ్యం అని మక్కమ్ అనగానే నీకు జీతం ఇస్తుంది నీ ఉద్దేశ్యం కోసం కాదని శకుంతల అంటుంది. సేల్స్ మేనేజర్ ఎక్కడ.. ఇంకా రాలేదా.. ఇంత లేట్ అయింది.. తనకి అంత స్వేచ్ఛ ఇచ్చారా అని శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |